»Elephant Attack Youth Making Instagram Reel Trampled To Death By Wild Elephant In Uttar Pradeshs Bijnor Video Surfaces
Video : రీల్ షూట్ చేద్దామని వెళ్లిన యువకుడిని తొక్కి చంపిన ఏనుగు!
అటుగా వచ్చిన అడవి ఏనుగుతో రీల్ చేద్దామని ఓ యువకుడు ప్రయత్నించాడు. ఆ ఏనుగు కాలితో తొక్కి అతడిని హతమార్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
Elephant Attack: ప్రమాదకరమైన చోట్ల రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు నేటి యువత. ఇలాగే ఓ వ్యక్తి అడవి ఏనుగుతో రీల్ చేసేందుకు ప్రయత్నించాడు. దాన్ని భయపెట్టి అక్కడి నుంచి తరిమేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ ఏనుగుకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఆ వ్యక్తిని తొలుత వేగంగా తరిమింది. తొండంతో ఎత్తి కొట్టింది. చివరికి కాలేసి తొక్కి చంపేసింది.
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలో చోటు చేసుకుంది. అడవి నుంచి అనుకోకుండా ఓ ఏనుగు(Elephant) బయటకు వచ్చేసింది. అక్కడున్న గ్రామాల్లో తిరుగాడింది. గురువారం ఉదయం హబీబావాలా గ్రామం దగ్గర తిరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఏనుగును చూసేందుకు చాలా మంది అక్కడికి చేరుకున్నారు.
అయితే ముర్సాలీన్ అనే 30 ఏళ్ల యువకుడు దానితో ఇన్స్టాగ్రాం రీల్(Instagram Reel) తీసుకోవాలని భావించాడు. దాన్ని అదిలించి అక్కడి నుంచి తరిమే ప్రయత్నం చేశాడు. దానికి కాస్త దగ్గరగా వెళ్లాడు. దీంతో ఏనుగుకు కోపం వచ్చింది. ఆ యువకుడి వెంట పడింది. దీంతో భయపడిన జనం అక్కడి నుంచి పరుగులు తీశారు. చివరికి ముర్సాలీన్ని సమీపించిన ఏనుగు అతడిని తొండంతో 25 అడుగుల ఎత్తుకు విస్సిరి కొట్టింది. కాళ్లతో తొక్కింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తీసుకెళ్లాక వైద్యులు అతడిని పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనకు ముందు అతడి కెమేరాలో రికార్డైన వీడియో ఇప్పుడు నెట్లో వైరల్గా మారింది. భయంతో అతడు పరుగులు తీస్తుండటం మాత్రమే అందులో అర్థం అవుతోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.
बिजनौर – रील बना रहे युवक को जंगली हाथी ने पटक कर मार डाला, हाथी हाईडिल कॉलोनी मे कई दिनों से मचा रहा उत्पात, शांत खड़े हाथी को भगाने गया था युवक, रील का वीडियो सोशल मीडिया पर वायरल , क्रोधित हाथी ने युवक को उतारा मौत के घाट, अफजलगढ़ क्षेत्र के हबीब वाला गांव की घटना.#Bijnor |… pic.twitter.com/BNaS5paXI1
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) June 13, 2024