ఇరాన్లో ఆందోళనలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అల్లర్లను అణచివేసే క్రమంలో భద్రతా దళాలు జరిపిన దాడుల్లో 35 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు, సుమారు 1200 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ‘హ్యూమన్‌రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ’ వెల్లడించింది. దేశంలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది.