Elephant Attack : కొమురం భీం జిల్లాలో ఏనుగు దాడి.. ఇద్దరు రైతుల మృతి
బుధవారం మహారాష్ట్ర సరిహద్దుల గుండా తెలంగాణలోకి ప్రవేశించిన ఓ ఏనుగు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బీభత్సం సృష్టించింది. బుధ, గురు వారాల్లో ఇద్దరు అన్నదాతలపై దాడి చేయగా వారిద్దరూ మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Elephant Attack in Komaram Bheem : ఏనుగు చేసిన దాడిలో రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు రైతులు మృతి చెందారు. ఈ ఘటనలు కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహారాష్ట్ర సరిహద్దుల గుండా తెలంగాణలోకి ప్రవేశించిన ఆ ఏనుగు పంట పొలాల్లోకి చొరబడింది. బుధవారం శంకర్ అనే రైతుపై(FARMER) దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం ఇలాంటి ఘటనే మళ్లీ పునరావృతం అయింది.
గురువారం పెంచికల పేట మండలం కొంపల్లిలో తారు పోషన్న(50) అనే రైతుపై ఏనుగు(ELEPHANT)దాడి చేసింది. మిర్చి తోటలో పని చేస్తున్న ఆ రైతుపై ఉన్నట్లుండి ఏనుగు దాడి చేసింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఈ ఏనుగు గురించి స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సత్వరం దీన్ని బంధించాలని ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
రాష్ట్రంలో ఏనుగుల దాడిలో రైతులు మృతి చెందిన ఘటనలు ఇవే ప్రధమం. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. దీంతో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ విషయమై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ కుటుంబానికి రూ.10లక్షలు నష్ట పరిహారం ఇస్తామని ప్రకటించారు. తాజాగా జరిగిన పోషన్న విషయంలోనూ ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.