AP: తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధాన్ని నిరాకరించిందని సోమశేఖర్ అనే వ్యక్తి.. ఓ మహిళను గొంతు కోసి హతమార్చాడు. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక కోర్లగుంట మారుతీనగర్‌లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇద్దరికీ వివాహేతర సంబంధం ఉందని.. ఇటీవల మహిళ ఈ బంధాన్ని నిరాకరించడంతో సోమశేఖర్ ఈ హత్య చేశాడని గుర్తించారు.