TG: ఈవీ వాహనాల బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ స్టేషన్ల పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. EV పాలసీ కింద తయారీదారులు, డీలర్లతో భేటీ ఏర్పాటు చేశామన్నారు. వాహనాల రాయితీ అమలుతో రూ.900 కోట్ల పన్ను నష్టం వచ్చిందన్నారు. ఉద్యోగులు కొనుగోలు చేస్తే 20% తగ్గించాలని కంపెనీలను కోరినట్లు చెప్పారు. MNC కంపెనీలు కొనుగోలు చేసేలా విధానం తెస్తున్నామన్నారు.