»Anant Ambani With Radhika Merchant Wedding Mameru Celabrations
Anant Ambani Wedding : అంబానీ ఇంట మొదలైన పెళ్లి సందడి.. బంగారు దీపాలతో అలంకరణ
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల పెళ్లి సందడి మొదలైంది. వివాహానికి ముందు జరిపే మామెరు వేడుకతో అంబానీల నివాసం యాంటిలియా వెలిగిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు నెట్లో వైరల్‌గా మారాయి.
Anant Ambani Radhika Wedding : భారతీయ సంపన్న కుటుంబం అంబానీల ఇంట పెళ్లంటే ఆ అట్టహాసమే వేరుగా ఉంటుంది. ముకేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహ వేడుకలు మొదలయ్యాయి. ఈనెల 12న వీరి వివాహం జరగనుంది. అయితే వివాహానికి ముందు జరిగా మామెరు వేడుక బుధవారం వారి ఇంట ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారి వధువు తరఫు వారంతా వరుడి తరఫు వారి ఇంటికి వస్తారు. బహుమతులు ఇచ్చి ఆశీర్వదిస్తారు. దీంతో ఈ వేడుకకు రాధికా మర్చంట్ కుటుంబం, వారి మేనమామ కుటుంబ సభ్యులు కలిసి యాంటియాకు తరలి వచ్చారు.
ఈ మామెరు వేడుక కోసం ముఖేష్ అంబానీ, నీతా అంబానీల సౌధం యాంటిలినా వెలిగిపోయింది. రకరకాల పుష్పాలంకరణలతో ఆ ఇంటిని మరింత అందంగా అలంకరించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే అక్కడ చేసిన బంగారు దీపాల అలంకరణ మరో ఎత్తు. ఆ వెలుగుల్లో ఆ శౌధానికి మరింత వన్నె చేకూరింది. అనంత్, రాధిక క్యారికేచర్లతో ఓ డిజిటల్ స్క్రీన్‌ని ఏర్పాటు చేశారు. ఇలా బుధవారం జరిగిన వేడుకలకు సంబంధించిన వీడియోని(video) కింద చూడవచ్చు.
ఇక అనంత్, రాధికల(Anant Ambani with Radhika Merchant) వివాహ వేడుకలు జూలై 12న ప్రారంభమై మూడు రోజులపాటు జరుగుతాయి. 12న వీరి వివాహం జరుగుతుంది. అతిథులంతా సాంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకలు హాజరవుతారు. తర్వాత జులై 13న శుభ ఆశీర్వాద్ కార్యక్రమం ఉంటుంది. తర్వాత 14న మంగళ్ ఉత్సవ్ వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకకు ఇండియన్ చిక్ డ్రస్ కోడ్‌తో అతిథులు హాజరవుతారు.
#WATCH | Visuals of Mosalu Ceremony ahead of the wedding of Anant Ambani with Radhika Merchant, in Mumbai, attended by Founder and Chairperson of Reliance Foundation Nita Ambani and her husband Mukesh Ambani.