BDK: 2026-27 విద్యా సంవత్సరానికి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి, 6 నుంచి 9వ తరగతిలో మిగిలిన సీట్లకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదలైంది. ఈ మేరకు కలెక్టర్ జితిష్ వీ పాటిల్ సమక్షంలో మంగళవారం పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గురుకుల అధికారులు, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.