SS: శక్తి టీం బృందాలు మహిళలు, బాలికలకు ‘శక్తి’ యాప్ వినియోగంపై మంగళవారం విస్తృతంగా అవగాహన కల్పించాయి. ఆపద సమయంలో ఈ యాప్‌లోని ఎస్.ఓ.ఎస్ బటన్ నొక్కితే పది నిమిషాల్లోనే పోలీసులు చేరుకుంటారని వివరించారు. సైబర్ మోసాలు, వేధింపుల నివారణకు డయల్ 100, 1091 వంటి నంబర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.