VSP: పూర్ణ మార్కెట్లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. అగ్నిప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన కాలిపోయిన 15 దుకాణాల బాధితులను ఓదార్చారు. అలాగే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.