ప్రకాశం: వెలిగండ్ల పోలీస్ స్టేషన్ను పామూరు సీఐ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని సీడీ ఫైళ్లు, కేసు రిజిస్టర్లు, స్టేషన్ రికార్డులు తదితర పత్రాలను సవివరంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలన్నారు. అనంతరం పోలీస్ సిబ్బందితో విధుల నిర్వహణ, ప్రజలకు అందించాల్సిన సేవలపై సీఐ చర్చించారు.