KMM: ఖమ్మం రైల్వే పోలీసుల ఆపరేషన్ యాత్ర సురక్షలో భాగంగా చోరీ కేసును ఛేదించారు. రైళ్లలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను చాకచక్యంగా మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 22 లక్షల విలువైన 373 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 4.16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.