BDK: గోదావరి నదిలో పడి యువకుడు గల్లంతైన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వెంకటాపురానికి చెందిన జైపాల్ గోదావరి ప్రాంతంలో స్నేహితులతో కలిసి విందు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఫోన్ మాట్లాడుకుంటూ నదిలోకి వెళ్లి గల్లంతయ్యాడు. మంగళవారం పినపాక-కొత్తగూడెం వద్ద మృతదేహం లభ్యమవగా ఫోటో చూసి తండ్రి నిర్ధారించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.