నల్గొండ జిల్లా చందంపేట మండలం గాగిల్లాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతిచెందగా, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. బుడ్డనితండాకు చెందిన లింగాల లక్ష్మయ్య కూతురితో కలిసి వెళ్తుండగా, వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ప్రమాదంలో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన కూతురిని 108 అంబులెన్స్‌లో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.