»Quick Divorce Kuwait Couple Ends Marriage Just 3 Minutes After Wedding For Shocking Reason
Divorce : పెళ్లైన మూడు నిమిషాలకే భర్తకు విడాకులు!
పెళ్లైన మూడు నిమిషాలకే ఓ వధువు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. ఆ కారణం వింటే అంతా షాక్ అవ్వాల్సిందే. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Quick Divorce : పెళ్లైన నెలల వ్యవధిలోనే విడాకులు తీసుకున్న జంటల్ని మనం అప్పుడప్పుడూ చూస్తూ ఉంటాం. అయితే ఒక్క రోజు కూడా గడవకుండానే ఓ జంట విడాకులు(Divorce) తీసుకుంది. ఈ షాకింగ్ ఘటన జరిగింది ఎక్కడంటే.. కువైట్లో. అక్కడ ఓ జంటకు అప్పుడే వివాహ తంతు పూర్తయ్యింది. వివాహ వేదిక నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఆమె పెళ్లి కొడుకు కూడా నడుస్తోంది. అప్పుడు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. వెంటనే ఆమెను వరుడు పైకి లేవదీయలేదు. బదులుగా తెలివి తక్కవ దద్దమ్మ అంటూ తిట్ల పురాణం ప్రారంభించాడు. చుట్టూ అంతా చూస్తుండగానే అతడలా మాట్లాడేసరికి పెళ్లి కూతురు మనసు కలుక్కుమంది.
వెనువెంటనే విడాకులు తీసుకుంటానంటూ కోర్టు మెట్లెక్కింది. అలా ఆ జంట వివాహం ఇంటికైనా వెళ్లకుండా విడాకులకు దారితీసింది. విచారించిన కోర్టు వారిద్దరికీ డివోర్స్ సైతం మంజూరు చేసింది. దీంతో అతి స్వల్ప కాలిక పెళ్లిగా ఇది కువైట్ చరిత్రలో మిగిలిపోయిందంటూ అక్కడి అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ ఘటన 2019లో జరిగిందట. అయితే ఇప్పుడు ఇంటర్నెట్లో మరోసారి వైరల్గా మారి హల్చల్ చేస్తోంది. 2004లో యూకేలో ఓ జంట పెళ్లైన 90 నిమిషాలకే విడాకుల కోసం కోర్టు మెట్టెక్కారు. ఆ తర్వాత ఈ కువైట్(Kuwait) జంటే నిమిషాల వ్యవధిలోనే పెళ్లి పెటాకులు చేసుకునేందుకు సిద్ధమయ్యారు.