Heroine Taapsee comments on Anant Ambani and Radhika Merchant's marriage
Taapsee: ప్రపంచ కుభేరుడిలో ఒకడైన ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి అంటే ఎలా ఉంటుందో చూపించారు. బిలియనేర్స్ సైతం ఔరా అని అనుకునేలా పెళ్లి వేడుక నిర్వహించారు. సంగీత్, ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్, ఆఫ్టర్ వెడ్డింగ్ ఇలా నానా హంగామా చేసి అంతర్జాతీయ వార్తల్లో నిలిచారు. ఈ వ్యాపారవేత్త చిన్న కుమారుడు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ల వివాహం గురించి ఇప్పుడు అంతటా చర్చసాగుతోంది. జూలై 12న ముంబైలో జరిగిన పెళ్లి వేడుకలో సిల్వర్ స్క్రీన్ తారలు, వ్యాపార దిగ్గజాలు, ప్రముఖులు అందరూ అక్కడే దర్శనం ఇచ్చారు. అయితే అన్ని వేడుకల్లో హుషారుగా పాల్గొనే అందాల తారా తాప్సీ కనిపించలేదు. దీనిపై తాజాగా ఆమె స్పందించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాప్సీ పాల్గొంది. అందులో అనంత్ అంబానీ పెళ్లికి ఎందుకు వెళ్లలేదు అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆమె సమాధానం ఇస్తూ.. అంబానీ కుటుంబానికి తనకు ఎలాంటి అనుబంధం లేదని, వాళ్లు అందరి సెలబ్రెటీలకు ఇచ్చినట్లు తనకు ఆహ్వానం అందించారని చెప్పింది. వారితో వ్యక్తిగతంగా ఎలాంటి పరిచయం లేనందునా తాను వెళ్లలేదని చెప్పుకొచ్చింది. వివాహం అంటే ఎన్నో ఆప్యాయతలు, అనురాగాలు ఉంటాయి. మనం గెవలం గెస్టులుగా వెళ్లి రావడం ఇష్టం ఉండదు. ఆ కారణంగానే వెళ్లలేదు అని చెప్పారు. వ్యక్తిగతంగా పరిచయం లేని వేడుకలను తాను వెళ్లను అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొంత మంది నిజమే అంటే కొంత మంది కొట్టిపారేస్తున్నారు.