»On Talks Of Marriage With Bollywood Actress T20 World Cup Winner Kuldeep Yadav Makes Big Revelation
Marriage : బాలీవుడ్ నటితో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కుల్దీప్ యాదవ్
టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో సభ్యుడైన క్రికెటర్ కులదీప్ యాదవ్ తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఎవరిని వివాహం చేసుకోబోతున్నారన్న విషయంపైనా క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?
Kuldeep Yadav Marriage : క్రికెటర్ కులదీప్ యాదవ్(Kuldeep Yadav) పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. టీ20 ప్రపంచ కప్‌ని గెలిచి స్వస్థలానికి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా కాన్పూర్‌లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. వందలాది మంది అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. బాణసంచా కాల్చారు. డప్పులు, మేళతాళాలతో ఆయనను స్వాగతించారు. అనంతరం కులదీప్ ఓ మీడియా సంస్థకు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పెళ్లిక సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
తాను త్వరలో పెళ్లి(Marriage) చేసుకోబోతున్నట్లు కులదీప్ యాదవ్ ప్రకటించారు. అయితే కొద్ది కాలంగా ఆయన ఓ బాలీవుడ్ నటితో(Bollywood Actress) ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపైనా ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను సినీ రంగానికి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం లేదన్నారు. అలా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. తన కుటుంబాన్ని బాగా చూసుకునే తాను పెళ్లాడాలనుకుంటున్నట్లు(Marriage) తెలిపారు. అలాంటి అమ్మాయినే తన జీవితంలోకి స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే అందరికీ ఆ శుభవార్త చెబుతానంటూ నవ్వేశారు.
ఇక టీ20 వరల్డ్‌కప్(T20 World Cup) గెలవడంతో కులదీప్(Kuldeep) సంతోషం వ్యక్తం చేశారు. ఆ క్షణాల కోసం ఎంతో ఎదురు చూసిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నారు. ఈ సమయంలో ప్రపంచ కప్ గెలడం టీంకి ఎంతో అవసరమన్నారు. గెలిచి భారత్‌కు వచ్చిన తర్వాత నరేంద్ర మోదీని కలవడం తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింన్నారు. ఈ టోర్నీలో కులదీప్ 10 వికెట్లు తీసి టీం ఇండియా విజయాల్లో ప్రముఖ పాత్ర వహించారు.