E.G: భర్త మృతి చెందాడనే బాధతో వారం రోజులకే భార్య మృతి చెందిన సంఘటన కడియం మండలం కడియపులంకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శివరామ నర్సరీ రైతు పాఠంశెట్టి రామారావు (98) ఈ నెల 15న వృద్ధాప్యంతో మృతి చెందారు. భర్త మరణించిడాడినే బాధతో కుమిలిపోతూ మంగళవారం వెంకటలక్ష్మి (90) ప్రాణాలు విడిచారు. ఈ ఆదర్శ దంపతుల మృతి అందరినీ కలిచి వేస్తుంది.