NLG: ఆశా వర్కర్లకు కనీస వేతనం నెలకు రూ. 18,000గా నిర్ణయించి అమలు చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మంగళవారం కట్టంగూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆసంఘం కట్టంగూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.