AP: తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో నిర్వహించిన ‘రోడ్డు భద్రత మా ప్రాధాన్యత’ అవగాహన కార్యక్రమంలో హోంమంత్రి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ట్రాఫిక్ పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకు పోలీస్ శాఖకు అధునాతన బ్రీత్ అనలైజర్ పరికరాలను అందజేశామని మంత్రులు తెలిపారు. ప్రజల ప్రాణాల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.