నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్ మంగళవారం 48వ డివిజన్ కోటమిట్టలోని సచివాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్లు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.