కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహక పథకాలు అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా వాటిని పరిశ్రమల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.