JGL: పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో హత్యల సంఖ్య గత సంవత్సరం కంటే పెరిగిందని తెలిపారు. 2023లో 28 హత్యలు జరగగా.. ఈ సంవత్సరం ఇప్పటివరకు 29 హత్యలు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. అయితే, మిగతా నేరాల రేటు గత సంవత్సరం కంటే 5 శాతం తగ్గినట్లు వివరించారు.