ADB: నేరడిగొండ మండలం లక్కంపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా గెలుపొందిన సుజాత, ఉప సర్పంచ్ పూజ, వార్డు సభ్యులు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్‌తోనే ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు దక్కుతాయని గజేందర్ అన్నారు.