ప్రకాశం: మార్కాపురం పట్టణంలో ఉన్న కుక్కలన్నింటిని పట్టుకోవడానికి ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తెలిపారు. మీ ప్రాంతంలో కుక్కలు ఉంటే వెంటనే సమాచారం అందించాలన్నారు. 08596 – 222924 నంబర్‌కు సమాచారం అందజేయాలని కోరారు. పట్టుకున్న కుక్కలకు ఒంగోలు ఆపరేషన్ థియేటర్ స్టెరిలైజేషన్, వ్యాక్సిన్ వేసి మరలా తీసుకొచ్చి వదిలిపెడతామన్నారు.