లూలు మాల్ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నటి నిధి అగర్వాల్ విముఖత చూపింది. రాజాసాబ్ మూవీ పాట రిలీజ్ సందర్భంగా వచ్చిన నటిని అభిమానులు ఇబ్బందికి గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై పోలీసులు ఆమెను కలిసి ఫిర్యాదు చేయమని కోరారు. కానీ తాను ఎవరిపై కేసు పెట్టాలనుకోవడం లేదని నిధి స్పష్టం చేసింది.