NZB: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా నవీపేట్ మండల కేంద్రంలోని ఓ హై స్కూల్ విద్యార్థులు రైతుల పొలాల్లో పాల్గొని వినూత్న కార్యక్రమం నిర్వహించారు. వన్ డే కిసాన్ కార్యక్రమంలో భాగంగా 9,10వ తరగతి విద్యార్థులు మట్టయ్య ఫారం గ్రామానికి చెందిన రైతు దనరాజ్ పొలంలోనారు మోసి వరినాట్లు వేశారు. మండల వ్యవసాయ అధికారి నవీన్ సాగు పద్ధతులు, వరి రకాలు, రైతుల కష్టాలను వివరించారు.