రాజస్థానీ సంప్రదాయ కళ పిఛ్వాయీ ఇప్పుడు ఆధునిక ఇంటీరియర్ డిజైనింగ్‌లో సరికొత్త ట్రెండ్‌గా మారింది. గోడలపై ఫర్నిచర్ ఎక్కువ పెట్టకుండా, మినిమలిస్ట్ స్టైల్ కోరుకునే వారు ఈ పెయింటింగ్స్‌పై ఆసక్తి చూపుతున్నారు. కలువలు, ఆవులు, లతల మధ్య శ్రీకృష్ణుడి అందమైన చిత్రాలు పూజగది నుంచి లివింగ్ రూం వరకు ప్రశాంతతను అందిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఇంటికి రాయల్ లుక్ ఇస్తున్నాయి.