»Mohammed Shami Has Finally Addressed The Rumours Involving Him And Tennis Star Sania Mirza
Mohammed Shami : సానియా మీర్జాతో పెళ్లి పుకార్లపై ఫైర్ అయిన షమీ
గత కొంత కాలంగా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను క్రికెటర్ షమీ పెళ్లాడబోతున్నారంటూ పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. వీటిపై ఇప్పుడు షమీ ఎట్టకేలకు స్పందించారు. ఆయన ఏమంటున్నారంటే?
Mohammed Shami : క్రికెటర్ షమీ టెన్నిస్‌స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జాను పెళ్లి చేసుకోబోతున్నారని గత కొంత కాలంగా పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై షమీ ఫైర్ అయ్యారు. తొలిసారిగా దీనిపై ఆయన సపందించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సోషల్ మీడియాల్లో నకిలీ వార్తల్ని వైరల్ చేయడాన్ని ప్రజలు మానుకోవాలని అన్నారు. మీమ్స్ ఒక స్థాయి వరకు ఎంటర్టైన్మెంట్ని ఇస్తాయని అయితే అలాంటి వాటి వల్ల కొంత మందికి హాని కూడా జరుగుతోందని అన్నారు. అందుకనే సోషల్ మీడియాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు.
ఈ మధ్య కాలంలో షమీ యూట్యూబ్‌లో శుభంకర్ మిశ్రాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ముఖాముఖిలో భాగంగా సానియా మీర్జాతో పెళ్లి విషయాన్ని ఇంటర్య్వూవర్ ప్రస్తావించారు. దీంతో మహ్మద్ షమీ(Mohammed Shami) ఆ వార్తల్ని కొట్టి పడేశారు. సోషల్ మీడియాల్లో అసత్య ప్రచారాలకు( Rumours) దూరంగా ఉండాలని కోరారు. ఎవరైతే ఇలాంటి రూమలర్లను పోస్ట్ చేస్తున్నారో వారు వెరిఫైడ్ ఎకౌంట్ల నుంచి పోస్ట్ చేయాలని అన్నారు. అప్పుడు వారికి సరైన రిప్లై దొరుకుతుందని సవాల్ చేశారు. జీవితంలో ఏదైనా సాధించడానికి ప్రయత్నించాలని అప్‌గ్రేడ్ కావడానికి చూసుకోవాలని అన్నారు. అంతే తప్ప ఇతరుల విషయాలపై కామెంట్లు చేయడం కాదని చెప్పారు.
సానియా మీర్జా(Sania Mirza) పాక్ క్రికెటర్ షోయెబ్ మాలిక్‌కు విడాకులు ఇచ్చి ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. షమీ సైతం తన భార్య నుంచి విడిపోయి కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి పెళ్లి పుకార్లు నెట్లో హల్చల్ చేశాయి. ఆ మధ్య కాలంలో సానియా మీర్జా తండ్రి సైతం ఈ విషయాన్ని ఖండించారు. తన కూతురు ఇప్పటి వరకు షమీని ఎప్పుడూ కలవలేదని చెప్పుకొచ్చారు.