»Indian Students Return As Quota Row Sparks Violence In Bangladesh
bangladesh : బంగ్లా అల్లర్ల నేపథ్యంలో సరిహద్దులు దాటి దేశంలోకి వస్తోన్న భారతీయులు
బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతుండటంతో అక్కడి భారతీయులు స్వదేశానికి చేరుకునేందుకు సరిహద్దులను దాటి వస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bangladesh Protest : బంగ్లా ఘర్షణల కారణంగా భయాందోళనలకు గురైన భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు దాదాపుగా 450 మంది పౌరులు బంగ్లా(bangla) సరిహద్దులను దాటి స్వదేశంలోకి వచ్చారు. అలాగే నేపాల్, భూటాన్లకు చెందిన 600 మందికి పైగా విద్యార్థులు సైతం భారత సరిహద్దుల్ని దాటుకుని వచ్చి మేఘాలయలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ విషయాన్ని అధికారులు శనివారం వెల్లడించారు.
బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సంస్కరించాలని అక్కడి యూనివర్సిటీలు కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టాయి. ఈ ఆందోళనలు రాను రాను హింసాత్మకంగా(Violence) మారాయి. గత మూడు రోజులుగా తీవ్ర రూపం దాల్చాయి. ఈ అల్లర్లలో(protest) ఇప్పటి వరకు అక్కడ 105 మంది మరణించారు. ఈ నేపథ్యంలో భారతీయులు తిరిగి సొంత దేశానికి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 245 మంది భారతీయులు, 13 మంది నేపాల్ స్టూడెంట్లు సరిహద్దులు దాటి ఇక్కడికి వచ్చేశారు. అలాగే శనివారం తెల్లవారుజాముకు మరో 363 మంది మేఘాలయా దగ్గర సరిహద్దుల్ని దాటి భారత్లోకి వచ్చేశారు. వీరిలో భారతీయులు 204 మంది. 158మంది నేపాలీ విద్యార్థులు, ఒక భూటాన్ దేశస్థుడు ఉన్నారు. ఇలా మన దేశంలోకి వచ్చేస్తున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది వైద్య విద్యార్థులే ఉన్నారు. బంగ్లాదేశ్లో(bangladesh) మొత్తం 8000 మంది విద్యార్థులు సహా పదిహేను వేల మంది మన వాళ్లు(indians) ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వారంతా ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది.