థియేటర్ల భవిష్యత్తు ఏంటనే ప్రశ్న వచ్చిన ప్రతీసారీ… నెగటివ్ సమాధానాలే వస్తుంటాయి. మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా సినిమా వ్యాపారం చేసే విధానం, సినిమా మేకింగ్ విధానం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా హిట్ అయితే ఆ సినిమా చూడడానికి జనం ఖచ్చితంగా థియేటర్లకు వచ్చేవారు. ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయినాసరే డబ్బులు వస్తున్నాయి కానీ ఫూట్ ఫాల్స్ శాతంగా గణనీయంగా పడిపోయింది. ఎంత భారీ సినిమా అయినా ఓటీటీ లో చూడొచ్చనే ధోరణిలోకి చాలామంది ఆడియన్స్ మారిపోయారు.
ఇలాంటి తరుణంలో ఆయ్ సినిమా ప్రెస్ మీట్ లో నిర్మాత బన్నీ వాస్ ని ఓటీటీ రిలీజ్ గ్యాప్ గురించి ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ… ‘పెద్ద హీరోల సినిమాలు లేట్ అవ్వడం వల్ల, సినిమా సినిమా కు చాలా గ్యాప్ తీసుకోవడం వల్లగాని, ఓటీటీలో చాలా తక్కువ రోజులకే సినిమా విడుదల చేయడం వల్ల థియేటర్ బిజినెస్ బాగా తింటుంది. ఇది ఇలానే కొనసాగితే మరో మూడేళ్ళలో ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాల్లో 50% సింగల్ స్క్రీన్ లు మూసివేయడం ఖాయం’.
మన ఇండస్ట్రీలో పేదలు అందరూ అన్ని విషయాలు చర్చిస్తారు కానీ. బయటకు వెళ్ళాక ఎవరి సినిమా వారిదే అన్నట్టు అయిపోతున్నారు. అందరూ అనుకుని ఓటీటీ రిలీజ్ కి సరైన గ్యాప్ ఇవ్వకపోతే మనుగడ కష్టం అని అభిప్రాయపడ్డారు బన్నీ వాస్. ఇండస్ట్రీ లో ఉన్న అగ్ర నిర్మాతలు అయిన సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్, ఆసియన్ సునీల్ ఇలా అనేకమంది థియేటర్ల బిజినెస్ లో కూడా ఉన్న సంగతి తెలిసిందే