అమ్మతోడు అడ్డంగా నరికేస్తా.. ఎన్టీఆర్ నోట వచ్చిన ఈ డైలాగ్ అప్పుడే కాదు.. ఇప్పటికీ కూడా ఓ సన్సేషనే. స్టూడెంట్ నెంబర్1 సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్కు.. మాస్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన చిత్రాల్లో ‘ఆది’దే ఫస్ట్ ప్లేస్. అలాగే మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఫస్ట్ ఫిల్మ్ కూడా ఇదే. 2002లో రిలీజ్ అయినా ‘ఆది’ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సంవత్సరంతో ఆది రెండు దశాబ్దాలు కంప్లీట్ చేసుకుంది. అయితే ఇప్పటికే ఆ టైం దాటిపోయినా.. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ‘ఆది’ రీ రిలీజ్కు రంగం సిద్దం చేస్తున్నారు.
ఇప్పటికే మహేష్ బర్త్ డే కానుకగా పోకిరి, ఒక్కడు సినిమాలతో రికార్డ్స్ క్రియేట్ చేశారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఇక ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ.. జల్సా, తమ్ముడు స్పెషల్ షోలతో దుమ్ములేపారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇక రీసెంట్గా బాలయ్య నటించిన ‘చెన్నకేశవరెడ్డి’ రీ రిలీజ్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు నందమూరి ఫ్యాన్స్. అందుకే ఇప్పడు ఆది రీ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని నిర్మాత బెల్లంకొండ సురేశ్ చెప్పుకొచ్చారు. ‘చెన్నకేశవరెడ్డి’ రీ రిలీజ్కు అద్భుతమైన స్పందన వచ్చిన సందర్భంగా.. భారీగా ‘ఆది’ రీ రిలీజ్ చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడు రిలీజ్ చేయనున్నారనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కానీ నవంబర్లో ‘ఆది’ రీ రిలీజ్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. దాంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.