టాలీవుడ్లో తన ప్రత్యేక డాన్సింగ్ స్కిల్స్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్ తన తాజా చిత్రం “దేవర”తో మల్లి పాత ఎన్టీఆర్ ను చూపిస్తాడని టాక్ బాగా వినిపిస్తుంది.. గత కొన్ని సంవత్సరాలలో, డాన్స్ విషయంలో ఎన్.టి.ఆర్., ఒక్క RRR లో నాటు నాటు తప్ప తన స్థాయికి తగ్గ ప్రతిభను చూపించలేకపోయాడు. వాస్తవానికి ఆ స్కోప్ ఉన్న కేరక్టర్స్ పడలేదు.
దేవర సినిమా నుంచి కొన్ని రోజుల్లో విడుదలయ్యే 3వ పాట చాల ప్రత్యేకమని అంటున్నారు. ఇదొక డ్యాన్స్ నెంబర్, ఎన్టీఆర్ డాన్స్ మాములుగా లేదని ఈ పాత చూసిన పలువురు PRO లు చెబుతున్నారు. ఇప్పటికే, “దేవర” చిత్రంలోని “ ఫియర్ సాంగ్’, “చుట్టమల్లే” పాటలు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో భారీ విజయం సాధించాయి. “చుట్టమల్లే” పాట ప్రత్యేకంగా తెలుగు వెర్షన్లో 100 మిలియన్ల వ్యూస్‌ను చేరుకోగలుగుతుంది. ఈ పాటలకు సంబంధించిన రీల్స్ సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్‌ని పొందుతూ, ఎన్.టి.ఆర్. – జాన్వీ కపూర్ డ్యాన్స్ మూవ్మెంట్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసారు
దేవర సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ బజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎన్టీఆర్ ఫాన్స్ కూడా ఫుల్ జోష్ మీద ఉన్నారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచే ప్రిమియర్ షోలు పడతాయని సమాచారం