America: Arrest warrants issued for four Indians in human trafficking case!
America: అమెరికాలో భారతీయులకు ఊహించని షాక్ తగిలింది. మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు భారతీయ వ్యక్తులకు టెక్సాస్ పోలీసులు అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. ప్రిన్స్టన్లో పోలీసులు 15 మంది అమ్మాయిలను చూసిన తర్వాత వాళ్లపై అభియోగాలు మోపారు. కేవలం అమ్మాయిలే కాకుండా మగవాళ్లు కూడా ఉన్నారట. ప్రిన్స్టన్ పోలీసులు సీఐడి డిటెక్టివ్లు సంతోష్ కక్టూరి ఇంటి కోసం సెర్చ్ వారెంట్ పంపించారు.
ఈ మహిళలను కక్టూరి, అతని భార్య మహిళలను బలవంతంగా బంధించి తరలిస్తున్నారు. వీరి దగ్గర పోలీసులు ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లు, ప్రింటర్లు, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాళ్ల ఎలక్ట్రానిక్స్‌ని పరిశీలించి ఆపరేషన్ వివరాలను పోలీసులు తెలిపారు. పోలీసులు బాధితులను ప్రశ్నించగా.. డల్లాస్‌కు చెందిన ఇండియాకి చెందిన నలుగురు కన్సల్టెన్సీని నడిపిస్తూ బలవంతంగా ఇలా అక్రమ రవాణా చేయిస్తున్నారని తెలిపారు.