ఈరోజుల్లో చాలామంది వేడివేడిగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ చద్దన్నం తినడానికి అంతగా ఇష్టం చూపించరు. పొరపాటున రాత్రి అన్నం మిగిలిన సరే తినరు. కానీ పూర్వకాలంలో రాత్రికి మిగలేలా అన్నం వండుకుని ఉదయాన్నే ఆ చద్దన్నం తింటారు. ఈ అన్నం తినడం వల్ల బోలెడన్నీ ప్రయోజనాలున్నాయి.
Health: అన్నం పులిస్తే ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి సూక్ష్మ పోషకాల స్థాయి పెరుగుతుంది. ఇందులో పోషకాలతో పాటు బీ6, బీ12 విటమిన్లు కూడా ఎక్కువగా లభిస్తాయి. రోజూ చద్దన్నం తినడం వల్ల ఫైబర్ కంటెంట్ పెరిగి మలబద్దకం, నీరసం వంటి సమస్యలు కూడా తగ్గి.. ఉల్లాసంగా ఉంటారు. అలాగే బీపీ అదుపులో ఉండి ఆందోళన, ఒత్తిడి కూడా తగ్గుతాయి. శరీరంలోని వేడిని తగ్గించడంతో పాటు రోగనిరోధకశక్తిని కూడా పెంచుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి చద్దన్నం బాగా ఉపయోగపడుతుంది.
ఉదయాన్నే చద్దన్నంలో పెరుగు కలుపుకుని తింటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. చద్దన్నం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారతాయి. వేసవికాలంలో చద్దన్నం తింటే శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. వడదెబ్బ తగలకుండా రక్షణ కల్పిస్తుంది. ఎండ వల్ల కలిగే నీరసాన్ని నివారిస్తుంది. ఉదయాన్నే చద్దన్నం తింటే రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. అల్సర్లు, పేగు సంబంధ సమస్యలు ఉన్నవారికి చద్దన్నం పరమౌషధంలా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్గా తింటే అన్ని అవయవాలకు బలం కలుగుతుంది. చద్దన్నంలో ఉండే బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.