Solo Wedding : జపాన్‌లో పెరుగుతున్న సోలో వెడ్డింగ్ ట్రెండ్!
పెళ్లి చేసుకునేందుకు జంట అక్కర్లేదని నిరూపిస్తున్నారు జపాన్ యువతులు. ఈ మధ్య అక్కడ ఒంటరి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తమతో తాము ఎంతో ప్రేమగా ఉంటామని ప్రణామాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రమైన ట్రెండ్ ఏమిటో మనం తెలుసుకోకపోతే ఎలా?
Solo Wedding : జపాన్‌లో ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. ఇక్కడి యువతులు ఇప్పుడు ఎక్కువగా సోలో వెడ్డింగ్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తమని తామే వివాహం చేసుకుంటున్నారు. ఒంటరిగా హనీ మూన్కీ చెక్కేస్తున్నారు. పెళ్లి కొడుకు మాత్రం ఉండడు అంతే. మిగిలిన వివాహ తంతు అంతా సేమ్ టు సేమ్. సాధారణమైన పెళ్లిని తలదన్నేలా హంగు ఆర్భాటాలతో ఈ పెళ్లిళ్లు(Marriages) జరుగుతుండటం విశేషం.
ఈ ఒంటరి పెళ్లి(Single Marriage) గురించే ఇప్పుడు జపాన్ యువతులంతా ఇష్టంగా ఆలోచించేస్తున్నారట. వెడ్డింగ్ డెకరేషన్లు, వెడ్డింగ్ వైట్ గౌన్లను సైతం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మరీ తయారు చేయించుకుంటున్నారట. మామూలు పెళ్లికి ఏ మాత్రం తగ్గకుండా ఈ సోలో వెడ్డింగ్‌లను చేసుకుంటున్నారట. ఈ సందర్భంగా వారు కొన్ని రకాల ప్రణామాలనూ చేస్తున్నారు. ‘ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా నన్ను నేను ఎప్పుడూ ప్రేమించుకుంటాను. నన్ను నేను సంతోషంగా చూసుకుంటాను. నాతో నేను ప్రేమలో ఉంటాను’ అంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారట.
మరోవైపు సంప్రదాయబద్ధంగా జరిగే పెళ్లిళ్లు జపాన్‌లో(Japan) తగ్గిపోయాయని అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఈ ఒంటరి పెళ్లిళ్ల వల్ల కూడా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోందని తెలుస్తోంది. వారు సాధారణ పెళ్లిళ్లకు దీటుగా పెళ్లి ఖర్చులన్నీ చేయడం, హనీమూన్లు అంటూ పర్యటనలు చేస్తుండటం లాంటి వన్నీ ఇండైరెక్ట్‌గా దేశ ఆర్థిక వ్యవస్థను, పర్యాటకాన్నీ వృద్ధి చేస్తున్నాయని అక్కడి లెక్కలు చెబుతున్నాయి.