»Putin Gives Indian Pm Narendra Modi A Tour Of His Residence
Putin : ‘ఆయన జీవితం భారత ప్రజలకు అంకితం’ మోదీపై పుతిన్ ప్రశంసల వర్షం
రెండు రోజుల రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ తన జీవితాన్ని ప్రజలకు అంకితం ఇచ్చారని అన్నారు. రష్యాలోని మోదీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Putin On Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల రష్యా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం రష్యాలోని(RUSSIA) పుతిన్ అధికారిక నివాసంలో ప్రైవేటుగా విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోదీ పుతిన్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఇద్దరు దేశాధ్యక్షులు ఆలింగనం చేసుకున్నారు. ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. పుతిన్ అధికారిక నివాసాన్ని మోదీకి తిప్పి చూపించారు. పుతిన్ స్వయంగా బగ్గీ కార్ని డ్రైవ్ చేస్తూ మోదీని తీసుకెళ్లడం విశేషం.
ఈ సందర్భంగా మోదీని(MODI) పుతిన్(PUTIN) ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ జీవితాన్ని ప్రజలకు అంకితం ఇచ్చారని అన్నారు. మూడో సారి ప్రధాని అయిన ఆయనకు అభినందనలు తెలిపారు. ఆయన చేసిన కృషి వల్లే ఆయనకు ఈ స్థానం మళ్లీ లభించిందని అన్నారు. మోదీ చాలా శక్తివంతమైన వారని కొనియాడారు. అందుకనే ప్రజలు దేశానికి సేవే చేసే అవకాశాన్ని మరోసారి కల్పించారని అన్నారు.
ఈ సందర్భంగా మోదీ సైతం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. తాము శాంతి, సుస్థిరతలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. భారత్, రష్యాలు గత పదేళ్లుగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయని గుర్తు చేసుకున్నారు. పర్యాటకం, సంస్కృతి, విద్య, ఆరోగ్యం, పెట్టుబడులు, వాణిజ్యం, భద్రత, ఇంధన రంగాల్లో రెండు దేశాల ప్రజల మధ్య బంధం విస్తృతమైందని పేర్కొన్నారు. రెండు దేశాల బంధం బలోపేతం అయితే తద్వారా రెండు దేశాల ప్రజలు ప్రయోజనాలను పొందుతారని చెప్పుకొచ్చారు.
#WATCH | Visuals of PM Narendra Modi and Russian President Vladimir Putin in Novo-Ogaryovo