»Ambati Rambabu Ambati Fire On Chandrababus Comments
Ambati Rambabu: చంద్రబాబు వ్యాఖ్యలపై అంబటి ఫైర్
ఏపీ సీఎం చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు వంటివని చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు.
Ambati Rambabu: Ambati fire on Chandrababu's comments
Ambati Rambabu: ఏపీ సీఎం చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు వంటివని చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. రెండు రాష్ట్రాలు రెండు కళ్లు అంటే.. తెలంగాణ డిమాండ్లను అంగీకరించినట్టేనా అని చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబు మాటలు వింటుంటే ఏపీకీ ద్రోహం తలపెట్టినట్లు అనిపిస్తున్నదని అనుమానం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల సమస్యలపై ఇద్దరు సీఎంలు ఎందుకు చర్చించలేదని అంబటి ప్రశ్నించారు.
ఏపీలోని పోర్టులో తెలంగాణ వాటా అడుగుతున్నదని, టీటీడీ బోర్డు, ఆదాయంలోని వాటా కోసం తెలంగాణ అడిగిందని తెలిపారు. తెలంగాణకు వాటా ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధమేనా అయితే అని అంబటి ప్రశ్నించారు. పార్టీ పరంగా చంద్రబాబుకు రెండు రాష్ట్రాలు, రెండు కళ్లు కావచ్చు. కానీ ఏపీ ప్రభుత్వపరంగా చంద్రబాబు వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనతో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. విభజన జరిగిన పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. కానీ దాన్ని వినియోగించుకోకుండా చంద్రబాబు ఎందుకు పారిపోయి వచ్చారని ప్రశ్నించారు.