రాజధాని కీవ్‌తో పాటు ఉక్రెయిన్ నగరాలపై నిన్న రష్యా భీకర క్షిపణి దాడులకు దిగింది. ఈ దాడుల్లో కనీసం 30 మంది చనిపోయారని, 150 మందికి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది.
Russia: రాజధాని కీవ్‌తో పాటు ఉక్రెయిన్ నగరాలపై నిన్న రష్యా భీకర క్షిపణి దాడులకు దిగింది. ఈ దాడుల్లో కనీసం 30 మంది చనిపోయారని, 150 మందికి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ తెలిపింది. రాజధాని కీవ్‌లోని అతిపెద్ద పిల్లల ఆసుపత్రిపైన రష్యా క్షిపణి దాడులు జరిపింది. ఈ ఘటనలో పిల్లలు, వైద్య సిబ్బంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రస్తుతం అక్కడ సహాయక ఆపరేషన్ చేపట్టామని అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
40కిపైగా క్షిపణులతో తమ దేశంలోని అయిదు నగరాలను లక్ష్యంగా చేసుకుని రష్యా విరుచుకుపడిందని వారు పేర్కొన్నారు. అత్యాధునిక కింజాల్ సూపర్సోనిక్ క్షిపణులను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ తెలిపింది. 30 క్షిపణులను తాము ధ్వంసం చేసినట్లు పేర్కొంది. అమెరికాలో నాటో శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్న వేళ రష్యా ఈ దాడులు చేస్తోంది.