»The Boots Used By The Russian Army Are Made In Bihar They Are Unique
Bihar boots: రష్యా సైన్యం వాడే బూట్లు బీహార్లోనే తయారు.. దాని ప్రత్యేకలివే
బీహార్ లో రాజధాని పాట్నా తర్వాత బాగా అభివృద్ధి చెందుతున్న నగరం హాజీపూర్. ఈ పట్టణం పాదరక్షల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తయారయ్యే నాణ్యమైన పాదరక్షలకు అంతర్జాతీయంగా పేరుంది.
The boots used by the Russian army are made in Bihar.. they are unique
Bihar boots: బీహార్ లో రాజధాని పాట్నా తర్వాత బాగా అభివృద్ధి చెందుతున్న నగరం హాజీపూర్. ఈ పట్టణం పాదరక్షల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తయారయ్యే నాణ్యమైన పాదరక్షలకు అంతర్జాతీయంగా పేరుంది. అందుకే, రష్యా సైన్యం తమ సైనికుల కోసం హాజీపూర్ బూట్లనే వినియోగిస్తోంది. స్థానికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభమైన పాదరక్షల కంపెనీ ప్రస్తుతం కోట్లాది రూపాయలు ఆర్జిస్తోంది. వందలాది మందికి ఉపాధిని కల్పిస్తోంది.
2018లో స్థానికులకు ఉపాధి కల్పించే ఉద్దేశ్యంతో ప్రారంభమైన హాజీపూర్ బూట్ల కంపెనీ తక్కువ కాలంలోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. గత ఏడాది 15 లక్షల జతల షూస్ తయారైనట్లు కంపెనీ ప్రతినిధి శివ్ కుమార్ రాయ్ తెలిపారు. వీటి ధర 100 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. వచ్చే ఏడాదికల్లా కంపెనీ ఉత్పత్తులను మరో 50 శాతం పెంచాలని టార్గెట్ పెట్టుకున్నట్లు శివ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ తయారౌతున్న వాటిలో ఎక్కువ శాతం రష్యా దేశానికే ఎగుమతి చేస్తున్నట్లు ఆయన వివరించారు. తమ కంపెనీలో పనిచేస్తున్న వారి 70 శాతం మహిళలే ఉన్నారని కూడా జనరల్ మేనేజర్ శివకుమార్ తెలిపారు.
హాజీపూర్‌లోని కాంపిటెన్స్ ఎక్స్ పోర్ట్ ఫ్యాక్టరీలో పాదరక్షలతో పాటు ఫ్యాషన్ రంగానికి చెందిన అనేక ఉత్పత్తులు కూడా తయారౌతున్నాయి. ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, యూకేతో పాటు అనేక ఇతర దేశాలకు కూడా హాజీపూర్ ఫాషనబుల్ ఫుట్‌వేర్ ఎగుమతి అవుతోంది. తాజాగా బెల్జియం దేశానికి చెందిన ప్రతినిధులు కూడా హాజీపూర్ సందర్శించారు. వారితో డీల్ కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపారు. అంతర్జాతీయ బ్రాండ్లకు ధీటుగా తమ కంపెనీ తయారు చేసే షూస్ ఉండాలని భావిస్తున్నట్లు కంపెనీ మార్కెటింగ్ హెడ్ మజార్ పల్లుమీ తెలిపారు.
బీహార్‌లో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లవేళలా సహకరిస్తోందని కంపెనీ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మౌళిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని, ఇక్కడ పనిచేసే వారిలో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అభివృద్ధి చెందాలని కంపెనీ ప్రతినిధులు సూచించారు. తమ కంపెనీ అవసరాలకు అనుగుణంగా ఉండే స్కిల్‌ఫుల్ వర్కర్స్ ను తయారు చేసేందుకు త్వరలోనే ఓ ట్రైనింగ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు.