»Volodymyr Zelenskyy President Of Ukraine Who Expressed His Anger Over Prime Minister Modis Visit To Russia
Volodymyr Zelenskyy: ప్రధాని మోదీ రష్యా పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉక్రెయిన్ ప్రెసిడెంట్!
ధాన మంత్రిగా మూడోసారి గెలిచిన తర్వాత రష్యా పర్యటనకి వెళ్లారు. ఈ సందర్భంగా రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. అయితే మోదీ పర్యటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సోషల్ మీడియా ద్వారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Volodymyr Zelenskyy: President of Ukraine who expressed his anger over Prime Minister Modi's visit to Russia!
Volodymyr Zelenskyy: ప్రధాన మంత్రిగా మూడోసారి గెలిచిన తర్వాత రష్యా పర్యటనకి వెళ్లారు. ఈ సందర్భంగా రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. అయితే మోదీ పర్యటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సోషల్ మీడియా ద్వారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, వ్లాదిమిర్ పుతిన్‌ల భేటీని జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. రష్యా ఎప్పుడూ ఉక్రెయిన్‌పై దాడి చేస్తుంది.
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య నాయకుడు రష్యా వెళ్లి ప్రపంచంలోని అతిపెద్ద క్రిమినల్‌ను కౌగిలించుకోవడం చాలా బాధాకరమని జెలెన్ స్కీ విమర్శించారు. తాజాగా రష్యా ఉక్రెయిన్‌పై క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. వెంటనే మరో చిన్నపిల్లల ఆసుపత్రిపై క్షిపణి దాడి చేసింది. ఇలాంటి రోజున ప్రధాని మోదీ పుతిన్‌ను కలవడం, ఆలింగనం చేసుకోవడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు.