KDP: డ్వాక్రా మహిళల కోసం కూటమి ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డ్వాక్రా మహిళా సంఘాలతో కూరగాయల సాగు చేయించి, ఆ ఉత్పత్తులను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలకు సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కాంట్రాక్టర్ల స్థానంలో నేరుగా డ్వాక్రా మహిళా సంఘాల ద్వారానే కూరగాయల సాగు, సరఫరా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.