ఏపీ, కర్ణాటక సరిహద్దులోని ఓబుళాపురానికి ఈరోజు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ రానుంది. మైనింగ్ కంపెనీకి చెందిన లీజులతోపాటు, అక్కడున్న మొత్తం ఆరు లీజుల హద్దులు, రక్షిత అటవీ ప్రాంతం హద్దులను ఖరారు చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధులియా ఛైర్మన్గా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సభ్యులుగా నియమించారు.