MHBD: మరిపెడ మండలం వెంకంపాడ్ శివారులోని చింతల గడ్డ తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా అంగోత్ రజని రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఆమె విజయం సుగమమైంది. గ్రామంలోని ఆరు వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని రజని రవీందర్ అన్నారు.