KKD: భారత స్వాతంత్ర్య పోరాటంలో వందేమాతరం గీతం దేశభక్తిని రగిలించిందని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. వందేమాతరం గీతంపై మంగళవారం పార్లమెంట్లో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. దేశంలో స్వాతంత్య్ర కాంక్షను రేకెత్తించిన కేంద్రాలలో తూర్పు గోదావరి జిల్లా ఒకటన్నారు. ఉప్పు సత్యాగ్రహం కూడా ఉప్పాడ కొత్తపల్లిలో జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.