AP: రాష్ట్రంలో నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(TET) ప్రారంభం కానున్నాయి. రోజూ 2 సెషన్ల(9:30AM-12PM, 2:30PM-5PM)ల్లో ఈ నెల 21 వరకు ఆన్లైన్లో జరగనున్నాయి. మొత్తం 2,71,692 మంది దరఖాస్తు చేసుకున్న ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 133 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు గంట ముందుగానే తమ ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని అధికారులు సూచించారు.