సత్యసాయి: పెనుకొండలోని రాంపురం ఘాట్ వద్ద మాజీ మంత్రి రామచంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా ‘బాలనాగమ్మ’ నాటకాన్ని ప్రదర్శించారు. రాష్ట్ర మంత్రి సవితమ్మ ఈ నాటక ప్రదర్శనను తిలకించారు. తండ్రి ప్రజాసేవను గుర్తుచేసుకున్న మంత్రి, నాటక కళాకారుల ప్రతిభను అభినందించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులు అర్పించారు.