GDWL: ఈనెల 11న జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు గద్వాల పోలీసులు కట్టుదిట్టమైన భద్రతతో సిద్ధమయ్యారని ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం గ్రీవెన్స్ హాల్లో సిబ్బందికి ఎన్నికల విధులకు సంబంధించిన సమావేశం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల భద్రత, రూట్ మొబైల్ టీంలు, స్పెషల్ ట్రైనింగ్ ఫోర్స్ చేపట్టాల్సిన పనుల గురించి అవగాహన కల్పించారు.