తిరుపతి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలకు రైళ్లు పెంచాల్సిన అవసరం ఉందని MLA ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి-సాయినగర్ శిర్డీ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. గూడూరు-విజయవాడ మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ తిరుపతి నుంచి నడపాలని, హైదరాబాద్-గూడూరు నడిచే సింహపురి ఎక్స్ప్రెస్ తిరుపతి వరకు పొడిగించాలని కోరారు.