TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు మంజూరు చేసిన బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణలో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు కీలకంగా మారనున్నాయి.