MHBD: గంగారం మండలం దుబ్బగూడెం సర్పంచ్ పూనెం సంధ్యా రాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామస్థుల సహకారంతో బరిలో నిలిచిన మిగతా వారు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అనంతరం సంధ్యారాణి ఏకగ్రీవంగా ఎన్నికల్లో గెలిచేందుకు మార్గం సుగమం అయింది. తన సర్పంచ్ ఎన్నికకు సహకరించిన అందరికీ సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో గ్రామం అభివృద్ధి చేస్తామని తెలిపారు.